English   

పవన్ క్రిష్ సినిమాలో హీరోయిన్ కూడా దొంగే

 Jacqueline Fernandez
2021-03-13 10:16:23

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరవాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో పవన్ తన తరవాత ప్రాజెక్ట్ ను క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టారు. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ ను శివరాత్రి సంధర్బంగా విడుదల చేసారు. హరిహరవీరమల్లు సినిమాతో పవన్ తన కెరీర్ లోనే మొదటిసారిగా పిరియాడికల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కథను 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ సినిమాలో కోహినూర్ వజ్రం దింగలించే వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం సినిమాలో హీరోయిన్ కూడా దొంగ పాత్రలో నటిస్తుందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిధి అగర్వాల్ రాజ్యానికి రాణి పాత్రలో నటిస్తుండగా...జాక్వెలిన్ ఫెర్నాండేజ్ దొంగగా నటిస్తున్నట్టు సమాచారం.

More Related Stories