English   

ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోమో..ఆట నాది కోటి మీది

Jr NTR
2021-03-13 12:04:02

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్-1 తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా చేయలేకపోయారు. ఇక తాజాగా ఆయన మరోసారి బుల్లి తెరపైకి సందడి చేయడానికి వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం బిగ్ బాస్ తో కాకుండా తెలుగులో ఇప్పటికే సూపర్ హిట్ అయ్యిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో ముందుకు వస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఇప్పటికే తెలుగులో రాగా మొదటి సీజన్ కు నాగర్జున హోస్ట్ గా వ్యవహరించారు. 

ఇక మెగాస్టార్ కూడా ఈ షో ఒక సీజన్ కు హోస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఇదే షోను జెమిని టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో తీసుకువస్తున్నారు. కాగా ఈ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా షో ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రోమోలో ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తున్నాడు. "ఇక్కడ నుండి ఏం పట్టుకుపోతారో చెప్పలేను గాని లైఫ్ లో గెలవగలను అనే కాన్ఫిడెంట్ వస్తుంది" అంటూ ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. ఆట నాది కోటి మీది అంటూ డైలాగులు పేల్చారు. ఇక త్వరలోనే ఈ షో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.

More Related Stories