English   

బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad
2021-03-13 13:05:26

ప్రస్తుతం ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. మాస్ అయినా క్లాస్ అయినా దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ మిగతా డైరెక్టర్స్ కంటే భిన్నంగా ఉంటుంది. దాదాపు టాప్ హీరోలందరి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇక ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమా లో పాటలే సినిమాకు ప్రమోషన్ గా మారాయి. ముఖ్యంగా సినిమా లోని నీ కళ్ళు నీలిసముద్రం పాట మారు మోగింది. ఈ సినిమా పాటలు చిత్ర విజయం లో ఎంతో కీలకంగా మారాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీప్రసాద్ కు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ను ఇచ్చి అభినందించారు. 

ఇదిలా ఉండగా దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం దేవిశ్రీప్రసాద్ జీ తమిల్ ఛానల్ లో రాక్ స్టార్ పేరుతో ఒక మ్యూజిక్ ప్రోగ్రాం ను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ షో ప్రోమోను కూడా విడుదల చేసారు. ఇక ఈ షో ద్వారా దేవిశ్రీప్రసాద్ మరియ ఆయన టీమ్ తమను తమకు నిరూపించుకోబోతున్నారు.

More Related Stories