English   

డ్రగ్ కేసులో నోటీసుపై సినీ నటుడు తనీష్ ఏమన్నాడంటే..

Tanish
2021-03-13 16:49:02

డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజగా ఈ విషయంపై హీరో తనీష్‌ స్పందిచారు. తనకు బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని,  కానీ డ్రగ్స్‌ తీసుకున్నందుకు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. 2017లో బెంగుళూరులో నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి తాను వెళ్లింది నిజమేనని, కానీ అక్కడ ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదని వివరించాడు. 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద తనకు నోటీసులు వచ్చాయని, ఇది కేవలం ఆ కేసుకి సంబంధించి విట్నెస్‌గా మాత్రమే బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపాడు. విచారణకు హాజరు కావల్సిందిగా సమన్లు జారీ అయిన  నేపథ్యంలో ప్రస్తుతం తనీష్‌ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. 

More Related Stories