English   

అబ్బో శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా..

Anchor Sreemukhi
2021-03-13 17:51:55

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. శ్రీముఖి పటాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పటాస్ కంటే ముందే ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో హీరోకు చెల్లిగా నటించింది. కానీ ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక యాంకర్ గా సక్సెస్ అవ్వడంతో పలు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే శ్రీముఖిలో యాంకరింగ్ మాత్రమే కాకుండా ఎవరికీ తెలియని ఒక టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ ఇప్పుడు బయటపెట్టింది బ్యూటీ. 

అదేంటంటే శివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేస్తారన్న సంగతి తెలిసిందే. అలా శ్రీముఖి కూడా జాగారం చేసింది. అంతే కాకుండా జాగారం సమయంలో ఖాళీగా ఉండకుండా శివుడి ఫోటోను గీసింది. దాంతో శ్రీముఖిలోని చిత్రకారిని భయటకు వచ్చింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న శ్రీముఖి "శివరాత్రి రోజు జాగారం చేసాను. నిద్ర రాకుండా ఉండేందుకు శివుడి బొమ్మను గీశాను" అంటూ పేర్కొంది. ఇక శ్రీముఖి పోస్ట్ చూసిన ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. శ్రీముఖి టాలెంట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

More Related Stories