English   

క్రాక్ దర్శకుడిని సర్ప్రైజ్ చేసిన నారా లోకేష్

Nara Lokesh Gopichand malineni
2021-03-13 18:53:39

కరోనా లాక్ డౌన్ తరవాత థియేటర్ లోకి వచ్చిన సినిమా క్రాక్. దాంతో ఇండస్ట్రీ ఆశలన్నీ క్రాక్ పైనే పెట్టుకుంది. ఈ సినిమా చూద్దానికి ప్రేక్షకులు వస్తే ఇక డోకా లేదనుకుంది. ఇక లాక్ డౌన్ తరవాత విడుదలైన ఈ సినిమా అంచనాకు మించిన విజయం సాధించింది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా కంటే ముందు గోపిచంద్ రవితేజ తో రెండు సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక క్రాక్ మరో బ్లాక్ బస్టర్ కావడంతో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదైంది. 

దాంతో వరుస ఆఫర్లు అందుకుని గోపిచంద్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు సెలెబ్రెటీలు విషెస్ చెబుతున్నారు. రవితేజ, బాలయ్య ఇప్పటికే గోపిచంద్ కు విషెస్ చెబుతూ పోస్ట్ లు పెట్టారు. అయితే ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ గోపిచంద్ మలినేని కి విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నారా లోకేష్ లాక్ డౌన్ వేళ క్రాక్ సినిమా చూసారట. ఆ సినిమా చూసి భాగా ఎంజాయ్ చేశారట. ఆ విషయం ఇప్పుడు గుర్తు వచ్చి లోకేష్ ట్వీట్ చేశారు. గోపిచంద్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకున్నారు.

More Related Stories