English   

టాలీవుడ్ స్టార్ ల సినిమా షూటింగ్ లు ఎక్క‌డెక్క‌డ జ‌రుతున్నాయంటే

pawan kalyan
2021-03-15 11:19:48

త‌మ హీరోల సినిమాలు ఎక్క‌డెక్క‌డ జ‌రుగుతున్నాయో తెలుసుకోవాల‌ని అబిమానులు ఆత్రుతో ఎదురుచూస్తుంటారు. కాబ‌ట్టి ఏ హీరో సినిమా ఎక్క‌డ జ‌రుతుందో ఇప్పుడు చూద్దాం.  ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌న్ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో  జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్,రానా  కాంబినేషన్ లొ సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అయ్యప్ప కోషియామ్ తెలుగు రీమేక్ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీ లోనే జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ  బోయపాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా బీబీ3. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ లోని 7ఎకర్స్ లో జరుగుతోంది. 

ఇక నాగార్జున, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సైతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. దృశ్యం సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో వెంకటేష్ దృశ్యం 2 సినిమా రీమేక్ లోనూ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న సినిమా  పుష్ప. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కాచిగూడ లో జరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల లైగర్‌ సినిమా షూటింగ్ ముంబయ్ లో జరుగుతుంది. ఇదిలా ఉండ‌గా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ బాచు పల్లి లో జరుగుతుంది. మ‌రోవైపు సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది. 

More Related Stories