English   

టాక్ సూపర్.. కలెక్షన్లలో నో పవర్.. పాపం శర్వానంద్..

 Sharwanand Sreekaram
2021-03-15 12:44:19

శర్వానంద్ సినిమాలకు ఇండస్ట్రీలో ఒక అలవాటు ఉండేది. కెరీర్ మొదట్లో వీరు నటించిన ప్రతి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉండేది. ప్రస్థానం వరకు ఇదే ఆనవాయితీ కొనసాగింది. రన్ రాజా రన్ వచ్చిన తర్వాత శర్వానంద్ కెరీర్ లో మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఈయన సినిమాలు కమర్షియల్ విజయం కూడా సాధించాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ శర్వానంద్ విషయంలో కెరీర్ మొదటి పద్ధతులు మళ్ళీ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అర్థం కాలేదు కదా.. ఒక్కసారి శ్రీకారం సినిమా చూస్తే అర్థమవుతుంది. కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన మొదటి రోజు అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత శర్వానంద్ నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అంటూ అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ పొంగిపోయింది. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా బాగా సినిమాలో చూపించాడు కిషోర్. 

సినిమా టాక్ కు తగ్గట్టుగానే మొదటిరోజు 4.30 కోట్ల షేర్ వసూలు చేసింది శ్రీకారం. కానీ రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయింది. సినిమా బాగుంది అని అందరూ చెబుతున్నా కూడా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఫస్ట్ వీకెండ్ అయ్యేనాటికి ఈ సినిమా కలెక్షన్లు 10 కోట్ల షేర్ కూడా దాటలేదు. దాంతో శర్వానంద్ కెరీర్ లో ఈ సినిమా మరో కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కలెక్షన్లు రాకపోవడంతో శ్రీకారం సినిమా యూనిట్ నిరాశలో ఉన్నారు. ప్రమోషన్లు చేస్తున్న కూడా కలెక్షన్లలో మెరుగుదల కనిపించడం లేదు. జాతిరత్నాలు నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది ఈ సినిమా. చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్ రావడంతో పొంగిపోయిన శర్వానంద్ ఆనందం మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. దాంతో హిట్ కొట్టడానికి ఎలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవాలో తెలియక తికమక పడుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు శర్వానంద్. దాంతో పాటు మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

More Related Stories