English   

గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ శాకుంత‌లం షూటింగ్‌ ప్రారంభం

Shakuntalam
2021-03-15 16:32:48

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పౌరాణి్క‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ  నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్నఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ నివ్వ‌గా, సూప‌ర్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు. 

హీరో దేవ్ మోహన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఓ రాజుగా దుష్యంతుడి పాత్రలో కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. అసలు సిసలు నిర్మాత దిల్‌రాజుగారు  మా వెనక ఉన్నారు. మీరు కూడా నన్నుఆదరిస్తారని అనుకుంటున్నాను. సమంతతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎంతో సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను’  అన్నారు.

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడిక‌ల్‌ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్ప‌టికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి. దిల్ రాజు గారు, గుణ శేఖర్ గారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వంద శాతం నేను చేయాల్సింది చేస్తాను. గుణ శేఖర్ గారు ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు. రిఫరెన్సెస్ అడిగితే కూడా లేదని నీలిమ చెప్పింది. అంతా దర్శకుడి మైండ్‌లోనే ఉందని అన్నారు. ఈ పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ నా రేంజ్‌ను మించి ఉంది... అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను’ అన్నారు.

More Related Stories