English   

త్వరలో రామ్ తో సినిమా చేస్తా..సుకుమార్

Jagadam
2021-03-15 17:52:21

త్వ‌ర‌లోనే ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో సినిమా చేస్తాన‌ని క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ అన్నారు. తాజాగా ఓ ఇంట‌ర్యూలో రామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రామ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన జ‌గ‌డం సినిమా గురించి తెలిసిందే ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేక పోయినా ప్రేక్ష‌కులకు భాగా క‌నెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో రామ్ ఎలా ఉండేవాడు..రామ్ ప‌ర్ఫామెన్స్ గురించి..జ‌గ‌డం సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాను పంచుకున్నాడు. సుకుమార్ మాట్లాడుతూ... నిజాయతీగా చెప్పాలంటే... 'ఆర్య' కంటే ముందు 'జగడం' చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలున్నాయి. 'ఆర్య' తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి 'జగడం' కథ రూపొందింది. 'జగడం' కథ పూర్తయిన సమయానికి 'దేవదాసు' విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. 

రామ్‌తో 'జగడం' చేయాలని స్రవంతి రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా 'జగడం' మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. 'నాకు రాదు. రాలేదు. చేయలేను' అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే... పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి... ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతుంది. తన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ... ఇప్పటి రామ్‌తో మళ్ళీ 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది. అంటూ సుకుమార్ రామ్‌తో త్వ‌ర‌లో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

More Related Stories