English   

జాతిరత్నాలు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

 Jathi Ratnalu
2021-03-15 18:33:58

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి నచించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా నవీన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించారు. సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇక శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న ఈ సినిమాను విడుదల చేసారు. మార్నింగ్ షోతోనే హిట్ టాక్ రావడంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. 

అంతే కాకుండా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. కాగా మూడు రోజుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసిన ఈ సినిమా నాలుగు రోజులు పూర్తయ్యేసరికి 20.44 కోట్ల షేర్ ను రాబట్టింది. అంతే కాకుండా ఫస్ట్ డే కంటే ఫోర్త్ డే నే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. నిన్న ఒక్కరోజే ఈ సినిమా 5.3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రాంతాల వారిగా చూసుకుంటే ఏపీ తెలంగాణ కలిపి 16.52 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా...ఓవర్సీస్ 3.31 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.61 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

More Related Stories