English   

అనసూయ రెమ్యూనరేషన్ తో హీరోయిన్స్ కు చుక్కలు..

Anasuyas Remuneration
2021-03-16 11:49:25

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అనసూయ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు కూడా కుళ్ళుకునే స్థాయిలో ఈమెకు మార్కెట్ వుంది. ఒకవైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దానికి తోడు వరుస అవకాశాలు కూడా అనసూయను ఎప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. డిమాండ్ కు తగ్గట్టు గానే ఈమె పారితోషికం కూడా ఉంది. ఈ మధ్య చావుకబురు చల్లగా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. దీనిని ఐటమ్ సాంగ్ అంటే ఒప్పుకోను అంటుంది అనసూయ. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావు కబురు చల్లగా మార్చి 19 న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి అనసూయ ఎంత తీసుకుంది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సమాధానం ఇప్పుడు బయటికి వచ్చింది. నిజానికి చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించడానికి అనసూయ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దానికి కారణం గీతాఆర్ట్స్ పై ఆమెకు ఉన్న నమ్మకం. ఇంత కావాలి అని ఆమె అడగలేదు.. ఇంత ఇస్తామని బన్నీవాసు చెప్పలేదు. కానీ ఆయన తక్కువ ఇవ్వడని అనసూయకు కూడా బాగా తెలుసు. 

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక సాంగ్ చేయడానికి 15 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడుదల తర్వాత మరిన్ని డబ్బులు ఇవ్వడానికి కూడా నిర్మాత బన్నీవాసు సిద్ధంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం గీత ఆర్ట్స్ పై ఉన్న గౌరవంతోనే చేసిన పాట అంటుంది అనసూయ భరద్వాజ్. తాను ఐటమ్ సాంగ్స్ చేయనని కావాలంటే స్పెషల్ సాంగ్స్ చేస్తాను అంటుంది. ఏదేమైనా చాలా ఉంది హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటుంది అనసూయ.

More Related Stories