English   

నామినేషన్ వేసిన కమల్ హాసన్..చదువు, ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Kamal Haasan
2021-03-16 12:41:03

ప్రముఖ నటుడు కమల్ హాసన్  ప్రేక్షకలోకానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు. కమల్ మక్కల్ నీది మయ్యం అనే పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ డీఎంకే, అన్నా డీఎంకే తో కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలో దిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు దక్షిణం నుండి పోటీ చేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా సోమవారం కమల్ హాసన్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఎన్నికల అఫిడవిట్ లో కమల్ హాసన్ తనకు మొత్తం రూ.176.93 కోట్ల ఆస్తి ఉన్నట్టు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తులు రూ.131 కోట్లు ఉండగా...చరాస్థులు రూ. 49 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా ఆయన కేవలం 8వ తరగతి చదువుకున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇప్పటికే కమల్ హాసన్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేకపోయారు. ఇక ఈ సారైనా కమల్ సత్తా చాటుతారో లేదో చూడాలి.

More Related Stories