ఆమని లిప్ లాక్ సీన్ చేసింది అప్పుడేనట

ఒక్కప్పుడు హీరోయిన్ గా తెలుగు వారిని అలరించిన నటి ఆమని ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఆమని జాంబలకడి పంబ సినిమాలో నరేష్ కు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమా తరువాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించింది. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఆమని నటనకు నంది అవార్డు సైతం వచ్చింది. ఆ తరవాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది. ఇక అవకాశాలు తక్కువ అవడంతో సినిమాలకు దూరమైన ఆమని మళ్ళీ 2004 లో వచ్చిన ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ భార్యగా..ముగ్గురు బిడ్డల తల్లిగా అలరించింది. ఇక 2014 నుండి ఆమని తన సెంకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. అంతే కాకుండా చందమామ కథలు సినిమాలో నరేష్ తో లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ షాక్ కు గురిచేసింది. మరో విషయం ఏంటంటే సినిమాలో వయసు పై బడిన పాత్రల్లో నటించిన ఆమని నరేష్ లిప్ లాక్ సీన్ లో నటించడమే. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ ఆమని ఫుల్ బిజీగా వుంది.