English   

చిరు వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ట్రాక్ మామూలుగా ఉండదట

 Vennela Kishore
2021-03-16 13:17:38

ప్రస్తుతం అలరిస్తున్న కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ పేరు మొదట వినిపిస్తుంది. వెన్నెల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిషోర్ ఇంటిపేరునే తన మొదటి సినిమా పేరుగా మార్చుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత వెన్నెల కిషోర్ ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు. ముఖ్యంగా ఫారెన్ పెళ్ళికొడుకు..హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లకు వెన్నెల కిషోర్ నే ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో మెగాస్టార్ వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ట్రాక్ హైలెట్ గా ఉండబోతుందట. నిజానికి ఆచార్య సినిమా సీరియస్ ఎమోషనల్ గా సాగే కథ కానీ ఈ సినిమాలో చిరు టైమింగ్ కు తగ్గట్టుగా కొన్ని కామెడీ సన్నివేశాలను కూడా జోడించినట్టు తెలుస్తోంది. సినిమాలో చిరు గ్యాంగ్ లో ఉండే వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి మధ్య ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయట. ఇక వెన్నెల టైమింగ్ చిరు టైమింగ్ కలిసి ఏ రేంజ్ లో జోకులు పేలుతాయో చూడాలి.

More Related Stories