English   

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో మహేష్

Sandeep Reddy Vanga
2021-03-16 13:58:17

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమాల్లో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా సందీప్ రెడ్డి వంగా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. అంతే కాకుండా ఇదే సినిమాను బాలీవుడ్ లో హీరో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో మరో సినిమా కూడా బాలీవుడ్ లోనే చేస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో రన్బీర్ కపూర్ నటిస్తుండగా.. సినిమాకు యానిమల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ ను సందీప్ దక్కించుకున్నారు. అయితే సందీప్ మహేష్ తో సినిమా తీయడం లేదు. ఒక ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన యాడ్ షూట్ ను సందీప్ చిత్రించబోతున్నారు. ఈ యాడ్ లో మహేష్ పక్కన మిల్కి బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. ఈరోజే ఈ షూట్ ను చిత్రిస్తారట. అంతే కాకుండా త్వరలోనే ఈ యాడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుబడనున్నాయి.

More Related Stories