English   

మోసగాళ్ళు చూస్తున్న‌ప్పుడు ఆడియన్స్ త‌ప్ప‌కుండా థ్రిల్ ఫీల‌వుతారు.. కాజల్‌ అగర్వాల్

 Kajal Agarwal
2021-03-16 20:20:19

‘మోసగాళ్ళు’ లాంటి సినిమాను నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదు. నా రెగ్యులర్‌ కమర్షియల్‌ రోల్స్‌ కాకుండా అను వంటి ఓ డిఫరెంట్‌ రోల్‌ చేయడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది.

దర్శకుడు జెఫ్రి కథ విన్నప్పుడే నాకు నచ్చింది. ముంబైలో ఉన్న అక్కాతమ్ముడు అమెరికాలో ఎలా స్కామ్‌ చేస్తారు? అనే విషయాన్ని  వెండితెరపై చూసిన‌ప్పుడు త‌ప్ప‌కుండా  ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు. అను క్యారెక్టర్‌ను ఏంజాయ్ చేస్తూ  చేశాను.

కథ నచ్చే   ఈ సినిమాలో మంచు విష్ణు హీరో పాత్రకు అక్క పాత్ర‌ చేశాను. ఈ ఎంటైర్‌ స్కామ్‌లో మాస్టర్‌ మైండ్‌ అనుదే. మనం ఇద్దరం అక్కాతమ్ముడిగా చేస్తే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారా?అని మంచు విష్ణును అడిగాను. డైరెక్టర్‌ విజన్‌ను నమ్మి చేద్దాం. వర్కౌట్‌ అవుతుందని విష్ణు అన్నారు. అలా ‘మోసగాళ్ళు’ సినిమాను స్టార్ట్‌ చేశాం. కథ ప్రకారం నా పాత్రకు సినిమాలో లవ్‌ట్రాక్‌ లేదు. ఈ సినిమాలో అను పాత్రకు యాక్షన్‌ సీన్స్‌ లేవు. సునీల్‌శెట్టిగారితో సీన్స్‌ లేవు. నవదీప్, నవీన్‌ చంద్రలతో కొన్ని సీన్స్‌ ఉన్నాయి.

నేను ఇంకా ‘మోసగాళ్ళు’ సినిమా చూడలేదు. కానీ లెజండరీ యాక్టర్‌ మోహన్‌బాబుగారు ఈ సినిమాను చూసి భావోద్వేగానికి లోనైయ్యారని చెబుతున్నారు. అంత గొప్ప నటులు మోహన్ బాబు‌సార్‌కి సినిమా నచ్చినందుకుచాలా సంతోషంగా ఉంది.

More Related Stories