English   

ఓటీటీకి ఉప్పెన‌ జాంబీరెడ్డి గాలిసంప‌త్‌...స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Gaali Sampath
2021-03-17 13:57:59

ఒక‌ప్పుడు సినిమాలు థియేట‌ర్ లో విడుద‌ల‌య్యాక టీవీలో రావాలంటే చాలా కాలం ప‌ట్టేది. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. సినిమా విడుద‌ల‌య్యాక వారాల్లోనే ఓటీటీలోకి వ‌స్తుంది. ఇక తాజాగా విడుద‌లైన సినిమాలు కూడా ఓటీటీలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..మెగా మేన‌ల్లుడు వైష్న‌వ్ తేజ్ హీరోగా న‌టించిన సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో పాటు క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిసింది. దాంతో ఈ సినిమా ఓటీటీ విడుద‌ల‌ను మేక‌ర్స్ పోస్ట్ పోన్ చేశారు. 

ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా మార్చ్ 24 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండి. ఇక ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమా గా వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన సినిమా జాంబీ రెడ్డి. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల‌రించిన తేజ హీరోగా న‌టించారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 5న విడ‌ద‌ల కానుంది. ఇక ఈ చిత్రం మార్చ్ 26 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌లైన సినిమాల్లో గాలిసంప‌త్ ఒక‌టి. ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా న‌టించగా న‌ట కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ సినిమా విడుద‌లైన ప‌ది రోజుల్లోనే ఓటీటీ కి వ‌స్తోంది. ఈ చిత్రం మార్చ్ 19 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 

More Related Stories