English   

రాజీవ్ గాంధీ కథతో మహేష్ బాబు మురారి

Murari
2021-03-17 14:08:17

మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అంతే కాకుండా మహేష్ బాబు కెరీర్ లో ఓ మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ వెనక ఓ పెద్ద స్టోరీనే ఉందట. అదేంటంటే సినిమా దర్శకుడు కృష్ణ వంశీ రాజీవ్ గాంధీ ఫ్యామిలీ నుండే ఈ కథను తీసుకున్నారట. కృష్ణ వంశీ ఒకరోజు తన స్నేహితులతో కలిసి గోదావరి నదిలో లాంచీలో ప్రయాణం చేశాడట. ఆ సందర్భంగా వారిమధ్య రాజీవ్ గాంధీ హత్య  టాపిక్ వచ్చింది. 

అయితే ఆ కుటుంబంలో ముగ్గురు అలానే మరణించారని..వారి కుటుంబంలో శాపం కారణంగానే అలా అజరిగిందని లాంచీలో ప్రయాణిస్తున్న ఓ ఆయుర్వేద డాక్టర్ చెప్పాడట. ఇంకేముంది అదే లైన్ ను తీసుకుని కృష్ణ వంశీ మురారి కథను అల్లాడు. అంతే కాకుండా ఈ కథ కోసం భాగవతం, మహాభారతం లాంటి కృష్ణుడు, యశోద, పాండవుల క్యారెక్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించి కథను డెవెలప్ చేశాడట. ఇక ఆ కథకు మహేష్ బాబు, కృష్ణ, రామ లింగేశ్వరరావుకు చెప్పగా వారు ఒకే చెప్పారు. ఇక ఈ సినిమాకు మొదట "ముకుంద కృష్ణ మురారి "అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే మురారి అనే టైటిల్ ఖరారు చేసారు. ఇక ఈ సినిమా 2001 లో ప్రేక్షకుల ముందుకు రాగా ఘన విజయం సాధించింది.

More Related Stories