English   

హరీష్ శంకర్ సినిమాలో లెక్చరర్ గా పవన్ కళ్యాణ్

 Pawan Kalyan
2021-03-18 10:29:09

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ రీ ఎంట్రీ తో డబుల్ స్పీడ్ తో సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ కు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు హరిహరవీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియం సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఒకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో పవన్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుందంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కాలేజి లెక్చరర్ గా కనిపించబోతున్నారట. ఒక సామాజిక అంశాన్ని జోడించి సినిమా కథాంశాన్ని హరీష్ ప్లాన్ చేశారట. అయితే హీరోను క్లాస్ గా చూపించినా అందులో నుండి మాస్ ను తియ్యడం హరీష్ శంకర్ స్పెషాలిటీ. దాంతో సినిమా కాలేజి బ్యాగ్ డ్రాప్ లో వచ్చినా కమర్షియల్ గా తిస్తారన్నది సమాచారం. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

More Related Stories