English   

మెగా ఛాన్స్ కొట్టేసిన జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్

Uppena Vaishnav Tej
2021-03-18 12:12:35

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. వైష్ణవ్ కటౌట్ చూసి మెగా అభిమానులు ఫిదా అయ్యారు.  ఈ చిత్రంలో వైష్ణవ్ నటనకు ప్రశంసలు అందాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తరవాత వచ్చిన సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకే వచ్చాయి. ఇక ఈ విజయంతో వైష్ణవ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వైష్ణవ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తీశారు. ఇక దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. 

అంతే కాకుండా వైష్ణవ్ తేజ్  మరో సినిమాకు కూడా ఒకే చెపినట్టు సమాచారం. శివరాత్రి కానుకగా విడుదలైన మూడు సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కేవీ తో ఈ సినిమా ఉండబోతుందట. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ ప్రసాద్ నిర్మిస్తారట. అనుదీప్ పిట్టగొడ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా నాగ్ అశ్విన్ ఇచ్చిన అవకాశం తో జాతిరత్నాలు లాంటి సినిమాను తెరకెక్కించి టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఇక జాతిరత్నాలు లాంటి కామెడీ ఎంటర్టైనట్ తెరకెక్కించిన అనుదీప్ మెగా హీరోతో ఎలాంటి సినిమా తిస్తారో చూడాలి.

More Related Stories