English   

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఈవెంట్ కు సెన్సేషనల్ గెస్ట్

Vakeel Saab
2021-03-18 12:53:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరవాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. పవన్ రీ ఎంట్రీ తరవాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రీమేక్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో అంజలి, అనన్య నాగోళ్ల, నివేదిత థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నుండి విడుదలైన టీజర్...పాటలు.ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఎప్రిల్ 9 న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారట. ఈ ఈవెంట్ ను ఎప్రిల్ 3న యూసుఫ్ గూడ లో జరుగుతుందని సమాచారం. అయితే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హిందీ నుండి అమితాబ్ బచ్చన్..తమిళం నుండి అజిత్ వస్తారని ప్రచారం  జరుగుతోంది. అయితే వీరిద్దరూ కాదని ఓ సెన్సేషనల్ గెస్ట్ ఈవెంట్ కు వస్తారని తెలుస్తోంది. దిల్ రాజు పవన్ రేంజ్ కు తగ్గట్టుగా గెస్ట్ ను దింపుతారట. అయితే ఆ గెస్ట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
 

More Related Stories