English   

కింగ్ నాగార్జున తో కాజల్ అగర్వాల్ రొమాన్స్ 

Kajal Aggarwal
2021-03-18 16:20:37

కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ స‌త్తారుద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తూ..నాగార్జున- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతో‌న్న యాక్ష‌న్ డ్రామా‌లోకి కాజ‌ల్‌ను స్వాగ‌తిస్తున్నాం అని స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా  అనౌన్స్ చేశారు  మేక‌ర్స్. 

ఈ మూవీ షూటింగ్ గోవా, హైద‌రాబాద్‌, ఊటీ, లండ‌న్‌ల‌లో జర‌ప‌డానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా.. హీరోయిన్ కాజల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ - ``టాలీవుడ్‌లో నాకు చాలా అద్భుతమైన స‌మ‌యం. నేను తొలిసారిగా నాగార్జునగారితో కలిసి నటించబోతున్నాను. ఇప్ప‌టివ‌ర‌కూ నా కెరీర్‌లో పోషించన‌టువంటి ఒక ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారు అంటే విపరీతమైన ఇష్టం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయ‌న‌తో కలిసి పనిచేయడం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ఉంది`` అన్నారు. 

More Related Stories