English   

దృశ్యం టైపు సినిమాలో బాలయ్య...కూతురుగా స్టార్ హీరోయిన్

Balakrishna
2021-03-18 17:39:56

నటసింహం బాలయ్య హిట్టు ఫ్లాపు అని లెక్కలు వేసుకోకుండా గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో బీబీ 3 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో బీబీ 3 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో  పక్కా హ్యాట్రిక్ కొడుతారని బాలయ్య అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక తాజాగా బాలయ్య తదుపరి సినిమాపై ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. లెజెండ్ బాలకృష్ణ రౌడీ బేబీ సాయి పల్లవి తండ్రీ కుతుళ్ళుగా ఓ సినిమా చేయబోతున్నారట. 

వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇప్పుడు ఫిల్మ్ నగర్ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఓ యంగ్ డైరెక్టర్ ఏ చిత్రం కోసం కథను సిద్ధం చేశారు. స్టోరీని బాలయ్యకు వినిపించగా ఆయన ఒకే చెప్పారు కూడా. అయితే ఈ కథను సాయి పల్లవికి ఇంకా వినిపించలేదు కానీ..తను అయితేనే బాగుంటుందని డైరెక్టర్ భావిస్తున్నారు. ఈ సినిమా దృశ్యం సినిమా టైపులో ఉంటుందట. దృశ్యం లో మైండ్ గేమ్ తో పాటు రివేంజ్ డ్రామా ఉంటే...బాలయ్య సినిమాలో కేవలం రివేంజ్ నేపథ్యంలో సాగుతుందట. ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ హముగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మీనా లాంటి నటి కనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉన్న ఈ సినిమా అన్ని కుదిరితే 2022లో పట్టాలెక్కనుంది.

More Related Stories