English   

నితిన్ షాకింగ్ కామెంట్స్‌..పెళ్లయ్యాక బ‌ట్ట‌లుతికి స‌న్న‌బ‌డ్డాను

 Nithiin
2021-03-20 12:09:33

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లాక్ డౌన్ వేల షాలిని రెడ్డిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పెళ్లయ్యాక అంట్లు తోమి..బ‌ట్ట‌లుతికి స‌న్న‌బ‌డ్డాన‌ని అన్నారు. అయితే నితిన్ చెప్పింది సీరియ‌స్ గా కాదు. ప్ర‌స్తుతం నితిన్ రంగ్ దే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర ట్రైల‌ర్ ను క‌ర్నూల్ లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి లాంఛ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నితిన్ ను ఓ అభిమాని పెళ్ల‌య్యాక నితిన్ చిక్కిపోయారు కార‌ణ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌గా నితిన్ చ‌మ‌త్కారంగా పెళ్లాయ్యాక బ‌ట్ట‌లుతికి అంట్లు తోమి స‌న్న‌బ‌డ్డాన‌ని చెప్పారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో నితిన్మా ట్లాడుతూ.."క‌ర్నూలు రావ‌డం నాకిదే ఫ‌స్ట్ టైమ్‌. క‌ర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్క‌డ తీసిన సినిమాలు హిట్ట‌య్యాయి. 

ఆ ప్లేసెంత ప‌వ‌ర్‌ఫుల్లో మీరింకా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్‌కు చాలా ఊళ్ల‌కు వెళ్లాను. అక్క‌డ అంద‌రి ఎన‌ర్జీ చాలా బావుంట‌ది. కానీ మీ ఎన‌ర్జీ దానికంటే ఓ లెవ‌ల్ ఎక్కువ ఉంది. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ చాలా చాలా బావుంది. మార్చి 26 సినిమా వ‌స్తోంది. ప్యూర్ ల‌వ్ స్టోరీ. మామూలుగా రాయ‌ల‌సీమ అంటే ఉట్టి మాస్‌, ఫ్యాక్ష‌న్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ల‌వ్ ఎక్కువ ఉంది. అందుకే ఫ‌స్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్క‌డ పెట్టాం. ఇదే ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి." అన్నారు. ఇదిలా ఉండ‌గా రంగ్ దే సినిమాలో నితిన్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లు గా న‌టిస్తుండా వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశి నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'రంగ్ దే థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.

More Related Stories