English   

రియల్ హీరో సోనూసూద్ కు అరుదైన గౌరవం

SpiceJet
2021-03-20 13:44:55

లాక్ డౌన్ వేల ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి సోనూసూద్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవాకార్యక్రమాలను పలువురు ప్రముఖులు అభినందించారు. లాక్ డౌన్ వేల ఎంతో మంది వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు తరలించి సోనూ సూద్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన సేవాకార్యక్రమాలను లాక్ డౌన్ సమయానికే పరిమితం చేయకుండా ఆ తరవాత కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది రోగులు, విద్యార్థులకు ఆయన సహాయ సహకారాలు అందించారు. 

అయితే సోనూ చేసిన సేవా కార్యక్రమాలకు గానూ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. దేశీయ విమాన సంస్థ స్పైస్ జెట్ సోనూ సూద్ చేసిన సామాజిక సేవకు గానూ అతడి ఫోటోలను బోయింగ్ విమానం 737పై వేసింది. ఈ ఫోటోలకు సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అని పేర్కొంది. దీంతో దేశంలోని నటుల్లో  స్పైస్ జెట్ పై ఫోటో పడిన మొదటి వ్యక్తిగా సోనూ సూద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ విషయం పై స్పందించిన సోనూ సూద్ తన కార్యక్యమలను ఇలానే కొనసాగిస్తానని...స్పైస్ జెట్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్ వేళ ఎంతోమంది విద్యార్థులను స్వదేశానికి చేర్చడానికి స్పైస్ జెట్ ఎంతో సహరించిందని చెప్పారు.

More Related Stories