English   

విడుదలైన మూడు సినిమాలకూ బ్యాడ్ ఫ్రైడేనే

Chaavu Kaburu Challaga
2021-03-20 16:57:17

లాక్ డౌన్ తరవాత ప్రతి వీకెండ్ మూడు నుండి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అలా విడుదలవుతున్న సినిమాల్లో ఏదో ఒకటి ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. గత వారం కూడా మూడు సినిమాలు జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ విడుదలయ్యాయి. కాగా మూడు సినిమాలకు మంచి కెలెక్షన్స్ ఏ వచ్చాయి. ఇక ఈ శుక్రవారం కూడా మూడు సినిమాలు విడుదల కాగా ఆ మూడు కూడా నిరాశపరిచాయి. ఈ శుక్రవారం చావుకబురు చల్లగా, శశి తో పాటు మోసగాళ్ళు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చావుకబురు చల్లగా సినిమాకు ప్రమోషన్స్ గట్టిగా చేసిన కారణంగా సినిమా చూసేందుకు ప్రేక్షకులు కాస్త ఎక్కువ అసక్తి చూపించారు. 

అయితే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో శని, ఆదివారాల్లో టికెట్ చిరిగే అవకాశం ఉన్నట్టు కనిపించడంలేదు. మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్ళు సినిమా దేశంలో జరిగిన భారీ ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి నటీనటులు ఉండటంతో ప్రేక్షకుల్లో కొంతమేర అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా చూశాక మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి కుమార్ తనయుడు ఆది శశి అనే సినిమాతో తన లక్ ను పరీక్షించుకున్నాడు. రోటీన్ కథ, ఆసక్తి లేని కథనం తో ప్రేక్షకులకు పరీక్ష పెట్టారు. ఇక ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. దాంతో ఈ శుక్రవారం విడుదలైన మూడు సినిమాలకు కూడా బ్యాడ్ ఫ్రైడే గానే నిలిచింది.

More Related Stories