English   

మోసగాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్స్

Mosagallu
2021-03-20 17:42:25

మంచు విష్ణు హీరోగా న‌టించిన తాజా చిత్రం మోస‌గాళ్లు. ఈ సినిమాకు బెఫ్రీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్ట‌రీ పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ సినిమా మార్చ్ 19న విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే మొద‌టి షోతోనే ఈ సినిమా డివైడ్ టాక్ ను మూట‌క‌ట్టుకుంది. సినిమాలో సంగీతం త‌ప్ప చెప్పుకోద‌గ్గ విష‌యాలేమీ లేవ‌ని కొంద‌రు అన‌గా...విష్ణు కాజ‌ల్ న‌ట‌న లో అద‌ర‌గొట్టార‌ని కొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 20 కోట్ల షేర్ ను రాబ‌ట్టాలి. 

కానీ మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ చూసుకుంటే కేవ‌లం 0.43 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. కాబ‌ట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 19.58 కోట్ల షేర్ ను రాబ‌ట్టాల్సి ఉంది. ప్ర‌ముఖులు న‌టించిన‌ప్ప‌టికీ సినిమా మొద‌టి రోజు కోటి కూడా క‌లెక్ట్ చేయ‌లేక‌పోవ‌డం మైన‌స్ అనే చెప్పాలి. ఇక ప్రాంతాల వారిగా మోస‌గాళ్లు క‌లెక్ష‌న్స్ చూస్తే...నైజాం 0.14 cr, సీడెడ్ 0.06 cr, ఉత్తరాంధ్ర 0.04 cr, ఈస్ట్  0.02 cr, వెస్ట్ 0.02 cr, గుంటూరు 0.03 cr, ఏపీ + తెలంగాణ మొత్తం 0.36 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.03 cr, ఓవర్సీస్ 0.03 cr క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక వ‌ర‌ల్ట్  వైడ్ టోటల్ క‌లెక్ష‌న్స్ 0.42 cr మాత్ర‌మే వ‌చ్చాయి. 

More Related Stories