English   

చావుకబురు చల్లగా ఫస్ట్ డే కలెక్షన్స్

Chaavu Kaburu Challaga
2021-03-20 18:00:22

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం చావు కబురు చల్లగా. ఈ సినిమాలో కార్తికేయ సరసన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. సినిమాను జిఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.  ఈ సినిమాను మార్చ్ 19న శుక్రవారం విడుదల చేసారు. కాగా ఏ చిత్రానికి మార్నింగ్ షో నుండి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమాకు జరిగిన ప్రమోషన్స్ చూస్తే కలెక్షన్స్ భాగానే రావాలి కానీ షాకింగ్ రేంజ్ లో సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక చావు కబురు చల్లగా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి. 

చావు కబురు చల్లగా సినిమాకు 13.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 13.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం 1.67 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 12.03 కోట్ల కలెక్షన్స్ రావాలి. ఇక సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో వీకెండ్స్ లో కలెక్షన్స్ గట్టిగా ఉంటే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ప్రాంతాల వారిగా కెలెక్షన్స్ చూస్తే ఏపీ తెలంగాణ మొత్తం కలిపి 1.58 కోట్ల కలెక్షన్స్ రాగా..రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05, ఓవర్సీస్ లో 0.04 కలెక్షన్లు వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా 1.67 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

More Related Stories