English   

ఐకాన్ సినిమా క్యాన్సిల్ అయ్యిందా.. దర్శకుడు ఏమన్నారంటే

Allu Arjun
2021-03-22 11:11:03

వకీల్ సాబ్ సినిమా సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఎప్రిల్ 9న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే మూడేళ్లు ముందే వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమా చేస్తానని ప్రకటించారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా సినిమా పట్టాలెక్కలేదు. మరో వైపు అల్లు అర్జున్ వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దాంతో ఐకాన్ సినిమా క్యాన్సిల్ అయ్యిందటూ వార్తలు వస్తున్నాయి. 

అయితే తాజాగా వకీల్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వేణు శ్రీరామ్ ను యాంకర్ కూడా ఇదే ప్రశ్న వేసింది. దానికి వేణు శ్రీరామ్ ఏమన్నారంటే...బన్నీ తో తను చేసే సినిమా కేవలం వాయిదా మాత్రమే వేశామని చెప్పారు. ప్రస్తుతం బన్నీ కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి చేసిన వెంటనే ఐకాన్ మొదలవుతుందని చెప్పారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బన్నీ కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా పూర్తయ్యాక వేణు శ్రీరామ్ తో సినిమా చేసే అవకాశం ఉంది. అంటే మూడేళ్ళ నుండి వెయిట్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్ మరో ఏడాది ఆగాల్సిందే.

More Related Stories