English   

బుల్లితెర పైకి విజయ్ సేతుపతి

Vijay Sethupathi
2021-03-22 11:33:16

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇతర భాషాల్లోను సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా సైతం సేతుపతి సత్తా చాటుతున్నారు. ఇటీవల ఆయన ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ కు విలన్ గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా మాస్టర్ సినిమాల్లోను విలన్ గా అలరించారు. ఇక త్వరలోనే సేతుపతి బాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా వెండి తెరపై అలరించిన విజయ్ సేతుపతి ఇప్పుడు బుల్లి తెరపైకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సన్ నెట్వర్క్ విజయ్ సేతుపతి తో ఓ టీవీ షోను ప్లాన్ చేసింది. ఈ టీవీ షోకు హోస్ట్ గా సేతుపతిని ఫిక్స్ చేసింది. ఈ షోకు సంబందించిన పూర్తివివరాలు తవరలోనే వెల్లడించనున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సన్ నెట్వర్క్ "ఎవరు కోటీశ్వరుడు" అనే రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ నెట్వర్క్ విజయ్ సేతుపతి తోనూ అలాంటి షోనే ప్లాన్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More Related Stories