English   

బాలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్

Sonakshi Sinha
2021-03-22 12:04:20

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరవాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్  పూర్తి కానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరు లూసిఫర్ రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాకు పలువురు దర్శకులను అనుకోగా చివరికి మోహన్ రాజా ను ఖరారు చేసారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఎప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పై వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు చిరు వేదళం రీమేక్ లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టు లను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. 

ఇవి ఇలా ఉండగానే చిరు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దర్శకుడు బాబి తో ఓ సినిమా చేస్తున్నా అంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించబోతుందట. ఇప్పటికే దర్శకుడు బాబి సోనాక్షి తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే మెగాస్టార్ బాలీవుడ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం పక్కా. ఇక సోనాక్షి బాలీవుడ్ లో యంగ్ హీరోలతో పాటు మిడిల్ ఏజ్ హీరోలతో ను నటించింది. అంతే కాకుండా రజిని కాంత్ కు హీరోయిన్ గా కూడా ఒక సినిమా చేసింది.

More Related Stories