English   

ఎర్ర రైక‌..ప‌చ్చ చీర‌..జ‌క్క‌న్న కాస్ట్యూమ్స్ మార్చ‌రా

SS Rajamouli
2021-03-23 00:30:32

రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెక‌రెకెక్కిస్తున్న‌సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టిస్తోంది. ఇటీవ‌ల అలియా బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినిమా నుండి పోస్ట్‌ర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు మేక‌ర్స్ స‌ర్పైజ్ ఇచ్చారు. ఈ పోస్ట‌ర్ లో అలియా ఎర్ర బ్లౌజ్ మ‌రియు గ్రీన్ చిర ధ‌రించి ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది. సినిమాలో సిత పాత్ర‌లో న‌టిస్తున్న అలియా లుక్ అభిమానుల‌ను ఎంతగానో అలరించింది. లుక్ అధిరిపోయినా ఇప్పుడు రాజ‌మౌళి మాత్రం నెటిజ‌న్ల ద‌గ్గ‌ర బుక్ అయ్యారు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

ఈ సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా అనుష్క న‌టించింది. అయితే కోర్ట్ స‌న్నివేశం సంద‌ర్భంగా అనుష్క కూడా రెడ్ బ్లౌజ్ మ‌రియు గ్రీన్ శారీని ధ‌రించి క‌నిపిస్తుంది. అంతే కాకుండా సినిమాలో బ‌ల్లాల‌దేవుడికి త‌ల్లిగా న‌టించిన ర‌మ్మ‌కృష్ణ కూడా ఓ కీల‌క స‌న్నివేశంలో ఎర్ర‌బ్లౌజ్‌, గ్రీన్ శారీని ధ‌రించి క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు బాహుబ‌లి సినిమాలోని అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ లుక్ మ‌రియు ఆర్ఆర్ఆర్ లో అలియా లుక్ ను జోడించి మీమ్స్ గా మార్చి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. జ‌క్క‌న్న కు ఈ కాస్ట్యూమ్స్ సెంటిమెంటా..? జ‌క్క‌న్న కాస్ట్యూమ్స్ మార్చ‌రా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

More Related Stories