English   

ఆకట్టుకుంటున్న రంగ్‌ దే మేకింగ్‌ వీడియో

RangDe​
2021-03-23 18:45:26

టాలీవుడ్‌ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'రంగ్​ దే'. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘చూసి నేర్చుకోకు’ అనే బ్యాక్‌గ్రౌండ్‌ పాటతో కొన్ని మేకింగ్‌ సన్నివేశాలను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. ఇందులో నితిన్‌, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇందులో సీనియర్‌ నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌, సుహాస్‌ తదితరులు నటిస్తున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చగా పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్‌ నూలి ఎడిటర్‌. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Related Stories