English   

తెలంగాణలో మళ్ళీ థియేటర్లు బంద్

 Corona Virus
2021-03-24 11:39:32

తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అవుతోంది. స్కూల్స్ లో కేసులు పెరుగుతుండ‌టంతో పాఠ‌శాల‌ల‌ను ఇప్ప‌టికే మూసేసింది. అంతే కాకుండా ఫంక్ష‌న్ హాల్స్ మూసివేయాల‌ని కేసీఆర్ ఆదేశించారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ‌తో మ‌ళ్లీ థియెట‌ర్లు కూడా మూత‌ప‌డే అవ‌కాశం ఉంది. వైద్యారోగ్య‌శాఖ అధికారులు థియేట‌ర్‌ల‌ను మూసివేయాల‌ని లేదంటే మ‌ళ్లీ యాబైశాతం సీటింగ్ ను అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో అని ఇప్పుడు అంతా ఆస‌క్తిగా చూస్తున్నారు. 

మార్చి 21న దేశంలో లాక్ డౌన్ విధించిన త‌ర‌వాత మూత ప‌డిన థియేట‌ర్లు మ‌ళ్లీ ఇటీవ‌లే తెరుచుకున్నాయి. తీవ్ర న‌ష్టాల‌ను చూసిన సినీ ప‌రిశ్ర‌మ మ‌రియు థియేట‌ర్ల ప‌రిశ్ర‌మ ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతోంది. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌లైన క్రాక్‌, ఉప్పెన‌, జాతి ర‌త్నాలు సినిమాల‌తో పరిశ్ర‌మ‌కు ధైర్యం వ‌చ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ అంటూ వార్త‌లు రావ‌డం థియేట‌ర్ల య‌జ‌మానులను ఇండ‌స్ట్రీకి చెందిన వారిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  

More Related Stories