English   

ల‌వ్ స్టోరీ సినిమాకు మ‌హేశ్ బాబు స‌పోర్ట్

Mahesh Babu
2021-03-24 11:49:22

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాలో నాగ చైతన్య స‌ర‌స‌న హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. సినిమాను పుస్కుర్ రాంమోహ‌న్ రావు, నారాయ‌న్ దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. టీజ‌ర్‌లో నాగ‌చైత‌న్య తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టారు. అచ్చ‌మైన తెలంగాణ అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌నుంది.  

ఇక సినిమా నుండి విడుద‌లైన పాటలు కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సాయి ప‌ల్ల‌వి స్టెప్పులేసిన సారంగ‌ద‌రియా పాట ట్రెండిగ్ లో ఉంది. అంతే కాకుండా నీ చిత్రం చూసి అని సాగే మ‌రోపాటకు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మ‌రో పాట‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఏవో ఏవో క‌ల‌లే అంటూ సాగే ఈ పాటను మార్చ్ 25న మ‌హేశ్ బాబు చేతుల మీదుగా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ సాంగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి. ఎన్నో అంచనాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ సినిమా ఎప్రిల్ 16న విడుద‌ల కానుంది.  
 

More Related Stories