English   

వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ డేట్‌ వచ్చేసింది

Vakeel Saab
2021-03-24 17:57:53

పవన్ కళ్యాణ్  వకీల్‌ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్‌లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల తేదిని ప్రకటించింది. మార్చి 29న వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.మరోవైపు వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్ రైట్స్ కూడా ధరకు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

More Related Stories