పవన్ కల్యాణ్ కు భార్యగా నిత్యామీనన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రానాకు జోడీగా సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ సరసన సాయి పల్లవి నటిస్తోందని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి నో చెప్పిందట. డేట్స్ సమస్య కారణంగా ఈ చిత్రంలో నటించడానికి సాయి పల్లవి నిరాకరించిందట. దాంతో మేకర్స్ నిత్యా మీనన్ ను సంప్రదించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండటం..కథ నచ్చడంతో పవన్ సరసన నటించేందుకు నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ తో నటించే ఛాన్స్ కొట్టేసినట్టే. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం షరవేగంగా జరుపుతున్నారు. మే నెల కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతే కాకుండా సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ రెండు సినిమాలకు పవన్ డేట్స్ కేటాయించి షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.