English   

కంగ‌నా ర‌నౌత్ కు స్వారీ చెప్పిన రాంగోపాల్ వ‌ర్మ

Ramgopal Varma
2021-03-25 12:21:45

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే బ‌గ్గుమ‌నేలా ఉంటుంది. ఒకరు ఎడ్డం అంటే మ‌రొక‌రు తెడ్డం అనే టైప్‌. కానీ తాజాగా వీరిద్ద‌రి సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కూడా కురిపించుకుంటున్నారు. అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య సంద‌ర్భంగా కంగ‌నా బాలీవుడ్ న‌టుల‌పై నెపోటిజం పై తీవ్ర విమ‌ర్ష‌లు కురింపించారు. దాంతో వ‌ర్మ కంగానాకు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దమే జ‌రిగింది. ఇక తాజాగా కంగ‌న ర‌నౌత్ న‌టించిన జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవి సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ట్రైల‌ర్ లో కంగ‌నా యాక్టింగ్ చింపేసింది.దాంతో చిత్రానికి విమ‌ర్ష‌కుల ప్ర‌శంస‌లు అందాయి. 

ఇక ఈ ట్రైల‌ర్ పై ఆర్టీవీ సైతం స్పందించి కంగ‌నాపై ప్ర‌శంస‌లు కురిపించారు. హేయ్ కంగ‌నా కొన్ని విష‌యాల్లో నేను నీతో ఏకీభ‌వించ‌క‌పోవ‌చ్చు కానీ..త‌లైవి ట్రైల‌ర్ లో సూప‌ర్ డూప‌ర్ గా న‌టించావ్. మైండ్ బ్లోయింగ్ ప‌ర్ఫామెన్స్. స్వ‌ర్గంలో ఉన్న జ‌య‌ల‌లిత కూడా క‌చ్చితంగా థ్రిల్ అయి ఉంటుంది. అంటూ పోస్ట్ పెట్టారు. దీనికి కంగ‌నా కౌంట‌ర్ ఇస్తూ..హేయ్ సార్ నేను మీతో ఏ విష‌యంలోనూ ఏకీభ‌వించ‌కుండా లేను. మీరంటే నాకిష్టం. మిమ్మ‌ల్ని ఎప్పుడూ ప్ర‌శంసిస్తుంటాను. ఇలాంటి ద‌రిద్ర‌మైన ప్ర‌పంచంలో ఈగోలు ఊరికే హ‌ర్ట్ అవుతుంటాయి. కానీ మీరు అలాంటివి ప‌ట్టించుకోరు. త‌లైవి మీద ప్ర‌శంస‌లు కురిపించినందుకు థాంక్స్‌. అంటూ పోస్ట్ పెట్టింది. ఇక కంగ‌నా పోస్ట్ కు ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. అవును కంగ‌నా ఎవ‌రైనా త‌మ నిర్న‌యాలు చెబితే ఎదుటివారిని రెచ్చ‌గొట్టిన‌ట్టు అవుతుంది. నీలాంటి న‌టి ప్ర‌పంచంలోనే లేదు నేను అంగీక‌రిస్తున్నా.

More Related Stories