English   

లవ్ స్టోరీ నుండి మరో పాట..సాయి పల్లవిని డామినేట్ చేసిన చైతూ

Evo Evo Kalale
2021-03-25 13:14:15

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం "లవ్ స్టొరీ". ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఫిదా సినిమాతో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల మరోసారి అదే బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ మరియు టీజర్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా సరంగదరియా పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు సినిమా నుండి విడుదలైన మూడు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక తాజాగా చిత్రం నుండి మరో పాటను విడుదల చేసారు. మహేష్ బాబు చేతుల మీదుగా "ఏవేవో కలలే "అంటూ సాగే పాటను విడుదల చేసారు. ఈ పాటను మహేష్ బాబు లాంచ్ చేయడం టెజో ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇక పాటకు భాస్కర బట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. పవన్ సీహెచ్ స్వరాలు సమకూర్చారు. ఇక సాంగ్ విడుదలయ్యాక నా ఫేవరేట్ సాంగ్ వచ్చేసింది అంటూ చైతు భార్య సమంత పోస్ట్ చేసింది. ఇక ఈ సాంగ్ లో సాయి పల్లవి తనదైన స్టైల్ లో స్టెప్పులు వేసింది. అంతే కాకుండా వర్షంలో సాయి పల్లవి కి జోడిగా నాగ చైతన్య కూడా స్టెప్పులు వేయటం విశేషం.

More Related Stories