English   

ప్రభాస్ కోసం తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్

Kriti Sanon
2021-03-25 15:14:07

టాలీవుడ్ లో మహేష్ హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి సనన్. ఆ తరవాత నాగ చైతన్య తో దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఆ తరవాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకోవడం తో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఆదిపురుష్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా...కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం కృతి ట్యూటర్ ను పెట్టుకుని మరీ తెలుగు నేర్చుకుంటుందట. ఆది పురుష్ సినిమాను నేరుగా హిందీలో తెరకెక్కిస్తున్నారు. కానీ సినిమాలోని కొన్ని సన్నివేశాలని నేరుగా తెలుగులో కూడా తీసేందుకు ప్లాన్ చేశారట. మాములు సినిమా అయితే మ్యానేజ్ చేయొచ్చు. కానీ ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. కాబట్టి ఎక్కడా తేడా రాకుండా ఉండేందుకు కృతి తెలుగు నేర్చుకుంటుంది. ఇక నేరుగా తెలుగు సినిమాలు చేసినప్పుడు ఈ భామ తెలుగు నేర్చుకుని ఉంటే ఈ కష్టం వచ్చేది కాదేమో.
 

More Related Stories