English   

జ‌గ‌న్ నిర్ణయంపై ఎంతో సంతోషంగా ఉంది : చిరంజీవి

Chiranjeevi
2021-03-25 15:52:35

క‌ర్నూల్ జిల్లాలోని ఓర్వ‌క‌ల్ విమానాశ్రయానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర్సింహారెడ్డి పేరును పెడుతున్న‌ట్టు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయం అభినంద‌నీయం అంటూ మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన అనౌన్స్‌మెంట్ ప‌ట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని చెప్పారు. క‌ర్నూల్ ఎయిర్‌పోర్ట్‌కు మొట్ట‌మొద‌టి స్వాతంత్య్ర స‌మ‌రయోధుడి పేరు పెట్టడానికి ఆయ‌న అర్హుడ‌ని అన్నారు. ఆయ‌న పాత్రలో న‌టించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంద‌ని చిరంజీవి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ న‌ర్సింహారెడ్డి బ‌యోపిక్‌లో నటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను సైరా న‌ర్సింహారెడ్డి పేరుతో తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో మెగాస్టార్ కు జోడీగా న‌య‌న‌తార న‌టించింది. ఈ సినిమాలో కిచ్చ సుదీప్, విజ‌య్ సేతుప‌తి, అమితా భ‌చ్చ‌న్ లాంటి ప్ర‌ముఖ న‌టులు న‌టించారు. ఎన్నో అంచనాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. 

More Related Stories