English   

నాగ‌బాబు బాలీవుడ్ ఎంట్రీ..ఆ యంగ్ హీరోకు విల‌న్ గా

Nagababu
2021-03-25 16:13:15

టాలీవుడ్ లో సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన చ‌త్ర‌ప‌తి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. చ‌త్ర‌ప‌తి సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హంచగా బాలీవుడ్ రీమేక్ కు వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో టాలీవుడ్ ట‌వ‌ర్ స్టార్ నాగ‌బాబు న‌టించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం నాగ‌బాబు ఫోటోషూట్ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫోటోల‌లో నాగ‌బాబు నోట్లో సిగ‌రెట్ పెట్టుకుని విల‌న్ లుక్ లో క‌నిపిస్తున్నారు. దాంతో మొగా బ్ర‌ద్ర‌ర్ లుక్ చూసి షాక్ అయిన నెటిజ‌న్లు ఆరా తీయ‌గా ఆయ‌న చ‌త్ర‌ప‌తి రీమేక్ లో న‌టించ‌బోతున్న‌ట్టు తెలిసింది. దాంతో ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. మ‌రి సినిమాలో నాగ‌బాబు మెయిన్ విల‌నా లేదంటే  సైడ్ విల‌నా తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండ‌గా నాగ‌బాబు న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాత‌గా..హీరోగా అల‌రించారు. కానీ వీటన్నింటికంటే నాగ‌బాబుకు జ‌బ‌ర్‌ద‌స్త్ షోతో ఎక్కువ పాపులారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం జ‌బ‌ర్‌ద‌స్త్ కు గుడ్ బై చెప్పిన ఆయ‌న అదిరింది అనే షోలో జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 

More Related Stories