English   

వైల్డ్ డాగ్ ప్ర‌మోష‌న్స్‌..నాగ్ ను ముప్పు తిప్ప‌లు పెట్టిన గంగ‌వ్వ

Gangavva
2021-03-26 17:13:24

టాలీవుడ్ మన్మథడు నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో నాగ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఎప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగార్జున ప్రముఖ యుట్యూబ్ ఛానల్ మైవిలేజ్ షోకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ నాగర్జునను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నాగ్ ను గంగవ్వ తన ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టింది. 

కుటుంబ సభ్యుల గురించి చెప్పాలని గంగవ్వ నాగార్జున కోరగా ఆయన తన తోబుట్టువుల గురించి...తల్లి తండ్రుల గురించి మరియు కుమారుల గురించి చెప్పారు. అయితే నాగ్ తన భార్యల ప్రస్తావన తీసుకురాలేదు. నాగార్జున మొదట హీరో వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరికి నాగ చైతన్య జన్మించాడు. ఆ తరవాత ఏవో కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో నాగ్ ఎప్పుడూ తన భార్యాల ప్రస్తావన వచ్చినా తడబడుతుంటారు. అంతే కాకుండా గంగవ్వ సమంతకు బిడ్డ ఎప్పుడు పుడుతుందని ప్రశ్నించింది. దానికి నాగ్ నేను కూడా వెయిట్ చేస్తున్నా...వాళ్ళని అడుగుతున్నా అంటూ సమాధానం ఇచ్చారు. మరోవైపు అఖిల్ కు ఎప్పుడు పెళ్లి చేస్తారని గంగవ్వ ప్రశ్నించగా అది అఖిల్ ఇష్టం అంటూ నాగ్ ఆన్సర్ ఇచ్చారు.

More Related Stories