English   

 విజయ దేవరకొండ తో వంశీ పైడిపల్లి సినిమా

Vamsi Paidipally
2021-03-26 19:17:01

మున్నా సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వంశీ మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. ఎన్టీఆర్ తో బృందావనం తెరకెక్కించి హిట్ కొట్టాడు. రామ్ చరణ్ తో ఎవడు తీసాడు. అంతే కాకుండా నాగార్జున కార్తీ తో ఊపిరి సినిమాను తెరకెక్కించి హృదయాలను దోచుకున్నాడు. ఇక చివరగా వంశీ..మహేష్ బాబు తో మహర్షి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టు ను అనౌన్స్ చేయలేదు. దర్శకులంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా వంశీ మాత్రం తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు. 

అయితే తాజాగా వంశీ తదుపరి సినిమాపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రౌడీ హీరో విజయ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతున్నారట. తన నాలుగు సినిమాలను నిర్మించిన దిల్ రాజు తోనే ఈ సినిమాను కూడా తియ్యబోతున్నారట. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

More Related Stories