English   

అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా

Sandeep Reddy Vanga
2021-03-26 20:16:42

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజ‌క్టుల‌కు ఓకే చెబుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. వైష్ణ‌వ్ తేజ్ ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు మొద‌లు పెట్టారు. ఉప్పెన కంటే ముందే స్టార్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ర‌కుల్ ప్రీత్ సింగ్ నటింస్తోంది. ఇదిలా ఉండ‌గా వైష్ణ‌వ్ ఇప్ప‌టికే అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ సినిమాకు కూడా సైన్ చేశారు. ఈ చిత్రాన్ని మనం ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను కొత్త డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. 

మ‌రోవైపు మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేసేందుకు కూడా వైష్ణ‌వ్ తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. శ్రీవెంక‌టేశ్వ‌ర్ సినీ చిత్ర బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 2న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఇదిలా ఉండ‌గానే వైష్న‌వ్ మ‌రో క్రేజీ ప్రాజ‌క్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి త‌మిళ వ‌ర్ష‌న్ ఆదిత్య‌వ‌ర్మ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గిరీసాయ ఈ సినిమాను తెర‌కెక్కిస్తారట‌. ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌. 

More Related Stories