English   

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఆచార్య కానుక .. కామ్రేడ్ లుక్ లో సిద్ధ

Ram charan
2021-03-27 10:45:26

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ మెగాస్టార్ కలిసి ఇప్పటికే స్క్రీన్ పై కన్పించినప్పట్టకి కొద్ది సేపు మాత్రమే స్క్రీన్ పై మెరిసారు. అయితే ఆశ్చర్యలో మాత్రం రామ్ చరణ్ ముప్పై నిమిషాలపాటు స్క్రీన్ పై మెరవనున్నారు. 

ఇక ఆచార్య నుండి ఇప్పటికే విడుదలైన చరణ్ పోస్టర్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా చరణ్ బర్త్ డే సంధర్బంగా ఈరోజు మరో పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చరణ్ తో పాటు చిరు కూడా కనిపిస్తున్నారు. అంతే కాకుండా గన్ పట్టుకుని కామ్రేడ్ లుక్ లో అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చరణ్ తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక నిన్న చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కూడా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో చరణ్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.

More Related Stories