English   

డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న వ‌కీల్ సాబ్

 Pawan Kalyan
2021-03-27 12:26:50

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర‌వాత న‌టిస్తున్న చిత్రం వ‌కీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బోణీక‌పూర్‌, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ న‌టించిన పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపించ‌నున్నారు. అయితే తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్టుగా ద‌ర్శ‌కుడు క‌థ‌లో కొన్ని మార్పులు చేశారు.

ఇక సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. లైంగిక వేధింపులు ఎదురుకుంటున్న మ‌హిళ‌ల కోసం చేసే పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌బోతుంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. ఇక ఇటీవ‌ల డ‌బ్బింగ్ ను మొద‌టు పెట్టిన ప‌వ‌న్ తాజాగా పూర్తిచేసారు. ఎప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో అన‌న్య నాగోళ్ల‌, అంజ‌లి, నివేధిత తామ‌స్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

More Related Stories