English   

రంగ్ దే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్

Rang De
2021-03-27 12:42:51

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాను తొలిపేమ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తెరకెక్కించారు. సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. సినిమాలో నరేష్, వినీత్, రోహిణి, బ్రహ్మాజీ ,వెన్నెల కిషోర్, కౌసల్య కీలక పాత్రల్లో నటించారు. 

ఇక ఈ సినిమా శుక్రవారం మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో మ్యాట్నీ, ఫస్ట్ షోకు కలెక్షన్లు పెరిగాయి. ఆంద్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజు రూ. 4.65 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాం లో 1.54 కోట్లు, ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో రూ.0.52 కోట్ల, 0.32 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక కృష్ణా జిల్లాలో 0.21 కోట్లు, విశాఖలో 0.56 కోట్లు, గుంటూరు లో 0.67 కోట్లు, నెల్లూరు లో 0.27 కోట్లు...సీడెడ్ లో 0.60 కోట్ల షేర్ ను రాబట్టింది.

More Related Stories