English   

వేదం రాములు ఇక లేరు

Sircilla Ramulu
2021-03-27 12:49:19

వేదం సినిమాలో సిరిసిల్ల రాములు గా నటించిన నాగయ్య ఇకలేరు. నాగయ్య ఈరోజు ఉదయం 4:30 నిమిషాలకు మరణించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాతో నాగయ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాములు పాత్రలో నాగయ్య జీవించేశారు. దాంతో ఆయన సిరిసిల్ల రామయ్యగా నే ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో నాగయ్య నటనకు అవార్డులు సైతం వచ్చాయి. ఇక ఈ సినిమా తరవాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో హైదరాబాద్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేక సొంతూరుకు వెళ్లలేక...హైదరాబాద్ లో ఉండలేక ఆర్థిక సమస్యలతో ఆయన ఫిల్మ్ నగర్ లో భిక్షాటన చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆయన ధీన స్థితిలో ఉండటం చూసి గతంలో మంత్రి కేటీఆర్ తన నివాసానికి పిలిచి ఆర్థిక సహాయం చేసారు.

More Related Stories